దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: 13, 14, 15, 16 రౌండ్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం

Arun Chilukuri
Published on: 10 Nov 2020 2:32 PM IST
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: 13, 14, 15, 16 రౌండ్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
X

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు గంట గంటకూ ఉత్కంఠ రేపుతోంది. దుబ్బా​క ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్టు తలపడుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ 13, 14, 15, 16 రౌండ్లలో ఆధిక్యత ప్రదర్శించింది. 15, 16 రౌండ్ల‌లో 1500 మెజార్టీ సాధించింది. 15వ రౌండ్‌లో 955 ఓట్ల మెజార్టీ సాధించ‌గా, 16వ రౌండ్‌లో 749 ఓట్లు సాధించింది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 12వ రౌండ్‌లో ఆధిక్యం సాధించింది. 16 రౌండ్లు ముగిసేస‌రికి బీజేపీకి 1700 ఓట్ల మెజార్టీ ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story