దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: టీఆర్‌ఎస్‌ జోరు

దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: టీఆర్‌ఎస్‌ జోరు
x
Highlights

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు గంట గంటకూ ఉత్కంఠ రేపుతోంది. దుబ్బా​క ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్టు తలపడుతున్నాయి. 19 రౌండ్లు...

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు గంట గంటకూ ఉత్కంఠ రేపుతోంది. దుబ్బా​క ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్టు తలపడుతున్నాయి. 19 రౌండ్లు ముగిసేస‌రికి టీఆర్ఎస్ పార్టీకి 250 ఓట్ల మెజార్టీ సాధించింది. 13వ రౌండ్ నుంచి వ‌రుస‌గా 19వ రౌండ్ వ‌ర‌కు టీఆర్ఎస్ ఆధిక్యం కొన‌సాగుతూనే ఉంది. 19 రౌండ్లు ముగిసేస‌రికి టీఆర్ఎస్ పార్టీకి 53,053 ఓట్లు పోల‌వ్వ‌గా, బీజేపీకి 52,802, కాంగ్రెస్ పార్టీకి 18,365 ఓట్లు పోల‌య్యాయి. ఇక నాలుగు రౌండ్లు మాత్ర‌మే మిగిలాయి. మ‌రో అర గంట‌లో తుది ఫ‌లితం వెలువ‌డే అవ‌కాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories