దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: 9వ రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం

Arun Chilukuri
Published on: 10 Nov 2020 12:59 PM IST
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: 9వ రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం
X

దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు దుబ్బాక కౌంటింగ్‌ 9 రౌండ్లు పూర్తికాగా.. 7 రౌండ్లలో బీజేపీ, రెండు రౌండ్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించాయి. దుబ్బాక ఉప ఎన్నిక తొమ్మిదో రౌండ్‌ కౌంటింగ్‌లో బీజేపీ 1,084 ఆధిక్యంలో ఉంది. తొమ్మిదో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి 3,413 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 2,329 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ 675 ఓట్లు సాధించాయి. 9 రౌండ్లు కౌంటింగ్‌ పూర్తయ్యేసరికి బీజేపీ 4,190 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

మొత్తం 23 రౌండ్లు ఉండగా.. 14 టేబుల్లో కౌంటింగ్ కొనసాగుతుంది. ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్ నుంచి సోలిపేట సుజాత‌, కాంగ్రెస్ పార్టీ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి‌, బీజేపీ నుంచి రఘునందర్‌రావుతో పాటు చిన్నాచితక పార్టీల నుంచి 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story