దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: 8వ రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం

Arun Chilukuri
Published on: 10 Nov 2020 12:35 PM IST
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: 8వ రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం
X

దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు దుబ్బాక కౌంటింగ్‌ 8 రౌండ్లు పూర్తికాగా.. 6 రౌండ్లలో బీజేపీ, రెండు రౌండ్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించాయి. 8వ రౌండ్‌లో బీజేపీ 621 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. అయితే ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ 3,106 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రౌండ్‌లో బీజేపీ 3,116 టీఆర్‌ఎస్‌ 2,495.. కాంగ్రెస్‌ 1,122 ఓట్లు సాధించాయి.

మొత్తం 23 రౌండ్లు ఉండగా.. 14 టేబుల్లో కౌంటింగ్ కొనసాగుతుంది. రౌండ్ రౌండ్ కి ఫలితాలు మారుతుందడడంతో.. ఎవరూ గెలుస్తారనే అనేది ఆసక్తిగా మారింది. దీంతో గెలుపు తమదేనని ధీమాతో టీఆర్ఎస్, బీజేపీలున్నాయి. కాంగ్రెస్ మాత్రం మొదటి నుంచి మూడో స్థానంలోనే కొనసాగుతుంది. ఇండిపెండెంట్‌లు ఎవరూ కూడా తమ ప్రభావాన్ని చూపించలేకపోయారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story