దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్: నాలుగో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం

X
Highlights
దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ అధిక్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫలితాలు వెలువడిన నాలుగు రౌండ్లలోనూ ...
Arun Chilukuri10 Nov 2020 5:06 AM GMT
దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ అధిక్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫలితాలు వెలువడిన నాలుగు రౌండ్లలోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. నాలుగో రౌండ్‌లో బీజేపీకి 1425 ఆధిక్యత వచ్చింది. బీజేపీకి 3832, టీఆర్ఎస్ 2407ఓట్లు వచ్చాయి. దీంతో నాలుగో రౌండ్ ముగిసే సమయానికి 2684 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది.
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత రాంమాధవ్ ట్వీట్ చేశారు. దుబ్బాకలో ఆసక్తికర పోరు జరుగుతోందని రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య అసలైన పోరు జరుగుతోందని ట్వీట్ లో పేర్కొన్నారు. తమ పార్టీ ప్రస్తుతం ఆధిక్యంలో ఉందని, బీజేపీ అనూహ్య విజయం సాధించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
Web Titledubbaka bypoll results: BJP leads in 4th round
Next Story