రఘునందన్ రావు బంధువు ఇంట్లో రూ. 18.65 లక్షలు స్వాధీనం

X
Highlights
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి బంధువుల ఇంట్లో, కార్యాలయాల్లో పోలీసులు సోమవారం సోదాలు చేపట్టారు....
Arun Chilukuri26 Oct 2020 11:37 AM GMT
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి బంధువుల ఇంట్లో, కార్యాలయాల్లో పోలీసులు సోమవారం సోదాలు చేపట్టారు. రఘునందన్ రావు అత్తగారిల్లు, సమీప బంధువుల ఇళ్లతో సహా ఎనిమిది చోట్ల ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో రఘునందరన్‌రావు మామ ఇంట్లో రూ. 18 లక్షల 65 వేలు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు జరిపిన బంధువు ఇంటికి రఘునందన్ రావు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంట్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి ముందే బైఠాయించి రఘునందన్ తన నిరసన తెలిపారు. ఆయనకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Web TitleDubbak bypoll: Rs 18 lakh seized from kin of BJP leader Raghunandan Rao
Next Story