నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదు : డీఎస్

X
Highlights
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ తీరుపై రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికలు ఒక...
Arun Chilukuri19 Nov 2020 3:00 PM GMT
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ తీరుపై రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికలు ఒక జిమ్మిక్కన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాల్సింది పోయి ఆదరబాదరగా ఎన్నికలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్దంగానే ఎన్నికలు జరుగుతున్నాయా అన్న అనుమానం కలుగుతుందన్నారు. సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ హామీలపై విశ్వసనీయతను పెంచుకోవాలని సూచించారు. ప్రజలను ఎన్నిసార్లు మభ్యపెడతారని ప్రశ్నించారు. ప్రజలను, ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలు పెట్టడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య పార్టీలపై యుద్ధం అంటే ఏంటో అర్థం కాలేదని యుద్ధం అంటే బందూకులు తీసుకుని వెళుతారా? అని ప్రశ్నించారు.
Web TitleD.Srinivas Fires On KCR Over Early GHMC Elections
Next Story