శంషాబాద్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో నడిపిన యువతి

Drunken Woman Rash Driving in Shamshabad
x

శంషాబాద్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో నడిపిన యువతి

Highlights

Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ బస్టాండ్ వద్ద కారు బీభత్సం సృష్టించింది.

Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ బస్టాండ్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో యువతి కారు నడిపి రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీకొంది. ఆ యువతి రోడ్డు వెంట వెళ్తున్న వారితో వాగ్వాదానికి దిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ కారణాలతో ఈ కారుపై చలాన్లు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న వాహనం చలాన్ పే చేయకుండా ఎలా బయటకు వచ్చిందన్నది ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఘటనపై శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories