పబ్‌లో రేవ్ పార్టీ... రాహుల్‌ సిప్లిగంజ్‌ అరెస్ట్

Drugs in Hyderabad: పోలీసుల అదుపులో రాహుల్ సిప్లిగంజ్‌

Jyothi
Updated on: 3 April 2022 1:10 PM IST
పబ్‌లో రేవ్ పార్టీ... రాహుల్‌ సిప్లిగంజ్‌ అరెస్ట్
X

పబ్‌లో రేవ్ పార్టీ... రాహుల్‌ సిప్లిగంజ్‌ అరెస్ట్

Drugs in Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. బంజారాహిల్స్‌లోని రాడిసన్ పబ్‌లో డ్రగ్స్ దొరికినట్లు తెలుస్తోంది. పబ్‌పై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులకు కొకైన్ లభించింది. పోలీసులు దాడి చేయగానే 12 ప్యాకెట్లు కొకైన్‌ను కిటికీ నుంచి బయటపడేశారు. వీటిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పబ్‌లో మొత్తం 150 మంది ఉండగా అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి సంతకాలు తీసుకుని పంపించారు. ఐదుగురిని మాత్రమే పోలీసులు అదుపులో ఉంచుకున్నారు.

శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లోని ఫుడింగ్ మింక్ పబ్‌పై టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. తెల్లవారు జామున 3గంటల సమయంలో జరిగిన ఈ దాడుల్లో 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నాడు. పట్టుబడ్డవారిలో ప్రముఖులు, ఉన్నతాధికారుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 150 మంది యువతీయువకులు ఈ పార్టీలో పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story