హైదరాబాద్ మలక్‌పేట హిట్ అండ్ రన్ కేసు.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ డాక్టర్ శ్రావణి మృతి

Hyderabad: మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన శ్రావణి

Jyothi
Published on: 24 Sept 2022 10:52 AM IST
Dr Sravani Dies in MalakPet Hit and Run Case
X

హైదరాబాద్ మలక్‌పేట హిట్ అండ్ రన్ కేసు.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ డాక్టర్ శ్రావణి మృతి

Hyderabad: మలక్‌పేట హిట్ అండ్ రన్ ప్రమాదంలో తీవ్రగాయాలై, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న డాక్టర్ శ్రావణి ఇవాళ తెల్లవారుజామున మృతి చెందింది. గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న శ్రావణి పరిస్థితి విషమించి కన్నుమూశారు. 25 రోజుల కిందటే వాళ్ల అమ్మ గుండెపోటుతో మరణించగా.. ఇప్పుడు శ్రావణి కూడా ఇలా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

హస్తినాపురం డెంటల్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న శ్రావణి ఈ నెల 21న స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. ఓ కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రావణి కింద పడిపోగా.. కారుతో సహా డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన చూసిన ప్రత్యక్ష సాక్షులు మలక్‌పేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే శ్రావణిని ఆస్పత్రికి తరలించారు.

గత మూడు రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రావణి పరిస్థితి విషమించి మృతిచెందింది. ఆమె తలకు బలమైన గాయం కావడంతోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కారును గుర్తించారు. నిందితుడికి లైసెన్స్, కారుకు పేపర్లు లేవని పోలీసులు గుర్తించారు.


Jyothi

Jyothi

Next Story