Formula-E Race: హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10న ఫార్ములా-ఈ రేస్‌పై సందిగ్ధత

Formula-E Race: ప్రభుత్వం త్వరగా క్లారిటీ ఇవ్వాలని కోరుతున్న నిర్వాహకులు

Shekhar G
Published on: 28 Dec 2023 3:43 PM IST
Doubt Over Formula-E Race On February 10 At Hyderabad
X

Formula-E Race: హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10న ఫార్ములా-ఈ రేస్‌పై సందిగ్ధత

Formula-E Race: హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా రేస్‌పై సందిగ్ధత నెలకొంది. అక్టోబర్ 30న ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి ఈ-ప్రిక్స్‌తో తెలంగాణలో ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేస్ నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలను సమర్పించాలని రేస్ నిర్వాహకులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ప్రభుత్వంతో ఫార్ములా రేస్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే రేస్‌కు మరో ఐదు వారాలే గడువు ఉండడంతో రేస్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఫార్ములా రేస్ ప్రతినిధులు సమాలోచనలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే రేస్‌ నిర్వహణ కోసం భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రతినిధులు ప్రభుత్వం దగ్గర విన్నవించుకున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా రేస్ నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story