హైదరాబాద్ కు తిరిగి రానున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు

Double-decker buses are returning to Hyderabad
x

Representational Image

Highlights

నిజాం కాలం నాడు భాగ్యనగరం రోడ్లపై చక్కర్లు కొట్టిన డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిరిగి రానున్నాయి. నగరంలోని ప్రముఖ కట్టడాలను వీక్షించేలా నగరవాసుల అవసరాలకు...

నిజాం కాలం నాడు భాగ్యనగరం రోడ్లపై చక్కర్లు కొట్టిన డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిరిగి రానున్నాయి. నగరంలోని ప్రముఖ కట్టడాలను వీక్షించేలా నగరవాసుల అవసరాలకు అనుగుణంగా రూపురేఖలను మార్చుకొని సరికొత్తగా రానున్నాయి. అన్నీ సక్రమంగా జరిగితే అతి త్వరలో బస్సులు నగరవాసులకు సేవలు అందించనున్నాయి.

భాగ్యనగరానికి చార్మినార్‌ ఎంత ఫేమసో.. ఒకప్పుడు డబుల్‌ డెక్కర్‌ అన్నా అంతే క్రేజ్‌ ఉండేది. ఆ బస్సు ఎక్కేందుకు నగరవాసులు, జిల్లాల నుంచి వచ్చే వాళ్లు ఎంతో ఆసక్తి చూపేవారు. పైనున్న బస్సులో కూర్చొని ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేసేవారు. 1972లో తొలిసారి భాగ్యనగరాన్ని పలుకరించిన డబుల్‌ డెక్కర్‌ సిటీతో మూడున్నర దశాబ్దాల బంధం కొనసాగించింది. అప్పట్లో ఈ బస్సులు నగరానికి చాలా స్పెషల్‌గా ఉండేవి. సిటీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూడ్డమే గాక, ఒక్కసారైనా అందులో ప్రయాణించాలనే ఆసక్తి కనబరిచేవారు. నగర రోడ్లపై డబుల్‌ డెక్కర్‌ బస్సులో వెళ్తుంటే అంబారీపై వెళ్తున్నట్లు అనిపించేందని చాలామంది ఇప్పటికీ చెప్తుంటారు.

నష్టాల కారణంగా డబుల్‌ డెక్కర్‌ బస్సులు కనుమరుగయ్యాయి. త్వరలో హైదరాబాద్‌ వాసులకు కనువిందు చేయబోతున్నాయి. మరో రెండు నెలల్లో బస్సులు సిటీ రోడ్లపై దూసుకుపోనున్నాయి. ప్రయోగత్మాకంగా 25 బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈనెల 18న ఫ్రీ బిడ్‌ సమావేశాన్ని నిర్వహించి బస్సులు ఎలా ఉండాలన్న విషయంలో ఈ సమావేశంలో తయారీదారులకు స్పష్టం చేయనుంది.

రెండు నెలల క్రితం నగరవాసి ఒకరు డబుల్‌ డెక్కర్‌ బస్సులను గుర్తు చేసుకుంటూ నాటి బస్సు ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశాడు. దీనికి వెంటనే స్పందించిన కేటీఆర్‌, తనకు డబుల్‌ డెక్కర్‌ బస్సులతో ఉన్న అనుభూతులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో డబుల్‌ డెక్కర్లను ఎందుకు ఉపసంహరించుకున్నారో తనకు తెలియదని వాటిని మళ్లీ నడిపే అవకాశం ఉందా అని ప్రశ్నిస్తూ ఆ ట్వీట్‌ను రవాణమంత్రి పువ్వాడకు ట్యాగ్‌ చేశారు. దీనికి స్పందించిన ఆయన వెంటనే ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌శర్మతో మాట్లాడి ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులు తిప్పే అవకాశం ఉంటే పరిశీలించాలని ఆదేశించారు.

ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో బస్సులను తిప్పనున్నారు. ఇందు కోసం రూట్‌ నెంబర్‌229 సికింద్రాబాద్‌- మేడ్చల్‌ వయా సుచిత్ర రూట్‌ నెంబర్ 219 సికింద్రాబాద్‌- పటాన్‌చెరు వయా బాలానగర్‌ క్రాస్ రోడ్డు, రూట్‌ నెంబర్‌ 218 కోఠి- పటాన్‌చెరు, రూట్‌ నెంబర్‌ 9ఎక్స్‌ సీబీఎస్‌- జీడిమెట్ల వయా అమీర్‌పేట్,,, రూట్‌ నెంబర్‌ 118 అప్జల్‌గంజ్‌- మెహిదీపట్నంలను ఎంపిక చేశారు. కొత్తగా కేబుల్‌ బ్రిడ్జి మీదుగా ఓ బస్సు తిరిగేలా ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే నివేదిక కూడా రూపొందించినట్లు సమాచారం.

మరోవైపు భాగ్యనగరంలో పెరిగిని రద్దీ దృష్ట్యా పై వంతెనలు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల సంఖ్య కూడా భారీగా పెరిగింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ లాంటి ప్రాంతాల్లో డబుల్ డెక్కర్‌ బస్సులను నడిపించడం ఇబ్బందిగా మారొచ్చు. ఇలాంటి ప్రాంతాల్లో బస్సులు ఏ విధంగా తిప్పాలోనన్న అంశంపై ఆర్టీసీ అధికారులు సర్వే చేస్తున్నారు.

సంవత్సరంలో నగరానికి ఏపీఎస్‌ఆర్టీసీ డబుల్‌ డెక్కర్‌ బస్సులను పరిచయం చేసింది. అలా వచ్చిన బస్సులు దాదాపు 34 ఏండ్ల పాటు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు ప్రత్యేక అనుభూతిని అందించాయి. 2006 సంవత్సరం అనంతరం అవి కనుమరుగయ్యాయి. నేటి తరానికి నగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సుల ప్రయాణం దూరమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories