Hyderabad: బన్సీలాల్‎పేటలో డబుల్ బెడ్ రూమ్స్ రెడీ.. బ్రహ్మాండం అనిపించే ఆధునిక ఇళ్లు...

Double Bedroom Houses Ready in Bansilalpet Hyderabad | TS Live News
x

Hyderabad: బన్సీలాల్‎పేటలో డబుల్ బెడ్ రూమ్స్ రెడీ.. బ్రహ్మాండం అనిపించే ఆధునిక ఇళ్లు...

Highlights

Hyderabad: 350 మీ. సీసీ రోడ్, సీవరేజ్ లైన్, భారీ మంచినీటి సంపు...

Hyderabad: హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతున్న క్రమంలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగానే మురికివాడలు గల ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం బన్సీలాల్‎పేటలోని బండ మైసమ్మ నగర్ డబుల్ బెడ్ రూం ఇళ్లపై గ్రౌండ్ రిపోర్ట్.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను దశలవారీగా అందుబాటులోకి తెస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 111 లొకేషన్లలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 70 వేలకు పైగా ఇళ్లు పూర్తి చేశారు. రేకుల ఇళ్లతో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న బస్తీవాసులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు.

బన్సీలాల్‎పేట బండ మైసమ్మ నగర్లోని డబుల్ బెడ్ రూం ఇళ్లను 5 బ్లాక్‎లలో జీ+5 ప్యాటర్న్ లో 310 ఫ్లాట్లుగా నిర్మించారు. ఒక్కొక్కటి 560 స్క్వేర్ ఫీట్‎లలో 7లక్షల 75 వేల వ్యయంతో నిర్మించారు. మౌలిక సదుపాయాలు, ఇతర వసతులకు ప్రాధాన్యమిచ్చారు. సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ పోల్స్ వంటి ఏర్పాట్లతో డిగ్నిటీ కాలనీని రూపొందించారు.

ఈ డిగ్నిటీ కాలనీలో 350 మీటర్ల సీసీ రోడ్డు, 300 మీటర్ల సీవరేజ్ లైన్, 100 కిలో లీటర్ల సామర్థ్యం గల మంచినీటి సంపు, వీధిదీపాల ఏర్పాటు, 11 లిఫ్టులు, అందుబాటులోనే 16 షాపింగ్ షటర్స్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో కాలనీపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories