Manthani: వివాదాలకు దారితీస్తోన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..

Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివాదం

Rama Rao
Updated on: 2 March 2022 4:30 PM IST
Double Bedroom House Dispute in Manthani | TS News Today
X

వివాదాలకు దారితీస్తోన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

Manthani: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకం రోజుకో వివాదానికి దారి తీస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథనిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంలో నాలుగేళ్ల క్రితమే లబ్దిదారులను ఎంపిక చేశారు. ఇళ్లు పూర్తయి ఏడాది గడిచినా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో కొందరు ఇళ్ల తాళాలు పగులగొట్టి గృహ ప్రవేశాలు చేస్తే.. మరికొందరు ఇంటి తాళాలు తీసుకుని ఇళ్లలోకి వెళ్లారు.. ప్రభుత్వం నిర్మించిన మొత్తం 96 ఇళ్లనూ ఆక్రమించుకున్నారు. అయితే కొంత మంది అసలు లబ్దిదారులకు ఇల్లు దక్కకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఇళ్ల ఆక్రమణలో అధికార పార్టీనాయకుల జోక్యం ఉందంటూ ఆరోపిస్తున్నారు బాధితులు.

Rama Rao

Rama Rao

Next Story