Degree Classes: సెప్టెంబరు 1 నుంచి డిగ్రీ క్లాసులు

DOST Online Degree Admission 2021 Schedule and Registration Process Strats From July 1st
x

దోస్త్ షెడ్యూల్ విడుదల (ఫైల్ ఇమేజ్)

Highlights

Degree Classes: దోస్త్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన అధికారులు * జూలై 1 నుంచి రిజిస్ట్రేషన్లు, అందుబాటులో 4 లక్షల సీట్లు

Degree Classes: సెప్టెంబరు 1 నుంచి తెలంగాణలో డిగ్రీ మొదటి సంవత్సరం క్లాసులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికనుగుణంగా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ 2021-22 అడ్మిషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీబీఎం కోర్సుల్లో అడ్మిషన్లను దోస్త్‌ ద్వారా నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు.

రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద 200 నిర్ణయించారు. దోస్త్‌ ద్వారా సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 23 నుంచి 31వ తేదీలోపు సంబంధిత కాలేజీకి వెళ్లి ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కాలేజీ ఫీజులను కూడా చెల్లించాలి. ఒకవేళ కేటాయించిన సీటు నచ్చకపోతే.. రెండు, మూడో దశల్లో వెబ్‌ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. దోస్త్‌ ద్వారా అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తిస్తుంది. దోస్త్‌ పరిధిలో 988 డిగ్రీ కాలేజీలు, సుమారు 4 లక్షల సీట్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. డిగ్రీలో ఈ ఏడాది నుంచి బీబీఏ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, బీబీఏ ఫైనాన్షియల్‌ అకౌంటెన్సీ, బీబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ స్కిల్స్‌ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories