DOST Notification 2020 : ఆగ‌స్టు 24 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

DOST Notification 2020 : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధులకు శుభవార్త.

Sumitra
Published on: 20 Aug 2020 6:14 PM IST
DOST Notification 2020 : ఆగ‌స్టు 24 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
X

ప్రతీకాత్మక చిత్రం 

DOST Notification 2020 : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధులకు శుభవార్త. తెలంగాణ‌ రాష్ర్ట ఉన్న‌త విద్యా మండలి రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం దోస్త్ నోటిఫికేష‌న్‌ను గురువారం విడుద‌ల చేసింది. ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేష‌న్ ప్ర‌క్రియను ఆగ‌స్టు 24 నుంచి సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు చేప‌ట్ట‌నున్నారని తెలిపింది. ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 17 నుంచి 22వ తేదీ మ‌ధ్య‌లో ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ రిపోర్టు ఇవ్వాలి. రిజిస్ర్టేష‌న్ చేసుకున్న విద్యార్థులు ఆగ‌స్టు 29 నుంచి సెప్టెంబ‌ర్ 8వ తేదీ వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు. రిజిస్ర్టేష‌న్ ఫీజు కేవలం రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మొద‌టి విడత అడ్మిష‌న్ల‌కు సంబంధించి సీట్ల కేటాయింపు సెప్టెంబ‌ర్ 16న ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్లు : ఆగ‌స్టు 24 నుంచి సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు

వెబ్ ఆప్ష‌న్ల నమోదుకు అవకాశం : ఆగ‌స్టు 24 నుంచి సెప్టెంబ‌ర్ 8వ తేదీ వ‌ర‌కు

మొదటి విడత సీట్ల కేటాయింపు : సెప్టెంబ‌ర్ 16న

విద్యార్థుల సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ : సెప్టెంబ‌ర్ 17 నుంచి 22 వరకు

రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం : సెప్టెంబ‌ర్ 17 నుంచి 23 వరకు

రెండో విడత సీట్ల కేటాయింపు : సెప్టెంబర్‌ 28న

రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం : సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 3 వరకు

మూడో విడత సీట్ల కేటాయింపు : అక్టోబర్‌ 8న




Sumitra

Sumitra

Next Story