Komatireddy Venkat Reddy: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు

Komatireddy Venkat Reddy: ఇకపై ప్రజా సమస్యలు తీర్చేందుకు 24గంటలు అందుబాటులో ఉంటానని, తనను రాజకీయాల్లోకి లాగొద్దని స్పష్టం చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Arun Chilukuri
Published on: 28 Jun 2021 6:54 PM IST
Don’t Drag me Into Politics Says Komatireddy Venkat Reddy
X

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Komatireddy Venkat Reddy: ఇకపై ప్రజా సమస్యలు తీర్చేందుకు 24గంటలు అందుబాటులో ఉంటానని, తనను రాజకీయాల్లోకి లాగొద్దని స్పష్టం చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఇకపై రాజకీయపరమైన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ఆయన అన్నారు. భువనగిరి, నల్గొండ పార్లమెంట్‌ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తానని, అక్కడి సమస్యలను తెలుసుకొని పరిష్కారం దిశగా ముందుకెళ్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్నారు. SLBC ప్రాజెక్ట్‌ జాప్యంతో వేలాది ఎకరాలు బీడు వారుతోందని, ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని అన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ‎‎

Arun Chilukuri

Arun Chilukuri

Next Story