Top
logo

దేశంలోని మెట్రోలతో హైదరాబాద్‌ మెట్రోను పోల్చొద్దు : కేటీఆర్

దేశంలోని మెట్రోలతో హైదరాబాద్‌ మెట్రోను పోల్చొద్దు : కేటీఆర్
Highlights

హైదరాబాద్‌ మెట్రో విజయవంతంగా నడుస్తోందని తెలిపారు. దేశంలో అన్ని మెట్రోలతో హైదరాబాద్‌ మెట్రోను పోల్చొద్దని, టీఎస్‌ఆర్టీసీ బస్సుల కంటే మెట్రో ఛార్జీలే తక్కువన్నారు. పాతబస్తీలోనూ మెట్రోరైలు సేవలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలు సమయంలో మెట్రో ట్రైన్‌ రాయితీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌ మెట్రో విజయవంతంగా నడుస్తోందని తెలిపారు. దేశంలో అన్ని మెట్రోలతో హైదరాబాద్‌ మెట్రోను పోల్చొద్దని, టీఎస్‌ఆర్టీసీ బస్సుల కంటే మెట్రో ఛార్జీలే తక్కువన్నారు. చెన్నై మెట్రోలో ఇప్పటికీ 75వేల మంది ప్రయాణిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో మెట్రోరైలు ప్రాజెక్టుపై 370 కేసులంటే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం‎ అధికారం చేపట్టాక రెండేళ్లలోనే 360 కేసులు పరిష్కరించామని తెలిపారు. పాతబస్తీలో మెట్రోరైలు సేవలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. కొందరూ మెట్రో రైలు ప్రాజెక్టుపై అపోహలు సృష్టిస్తున్నారని వాటీని మానుకోవాలి కోరారు. హైదరాబాద్ మెట్రోకు 80 గ్లోబల్ అవార్డులు వచ్చాయి. గతంలో గన్‌పార్క్‌ను పడగొడుతూ మెట్రోరైలు ప్రాజెక్టు డిజైన్ చేశారు. అమరవీరుల స్థూపానికి నష్టం జరగకుండా మెట్రోమార్గాన్ని తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story