Ration Cards: నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: గంగుల కమలాకర్

New Ration Cards: సామాజిక మాధ్యమాలు, ఇతరత్రాచోట్ల తెలంగాణలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై వస్తున్న సమాచారాలను నమ్మవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 17 Aug 2023 6:55 PM IST
Dont Believe False Propaganda on Issuance of New Ration Cards Says Gangula Kamalakar
X

Ration Cards: నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: గంగుల కమలాకర్

New Ration Cards: సామాజిక మాధ్యమాలు, ఇతరత్రాచోట్ల తెలంగాణలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై వస్తున్న సమాచారాలను నమ్మవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా ప్రచారాల్లో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అసత్య ప్రచారాల్ని ఎవరు నమ్మొద్దని నేడు పత్రికా ప్రకటణ విడుదల చేశారు.

ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా వస్తున్న ఈ ప్రకటనలను ఎవరు ప్రచారంలోనికి తీసుకురావద్దని హెచ్చరించారు. ప్రభుత్వం తరపు నుంచి కచ్చితంగా ప్రకటన ఇస్తామని, ప్రస్తుతం ఎలాంటి రేషన్ కార్డులు జారీ చేయడం లేదని ఆయన అన్నారు. ఈ మేరకు ప్రజలు వాస్తవాలను గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story