Hyderabad: బడంగ్‌పేట్ పరిధిలో బాలుడిపై దాడి చేసిన కుక్కలు

Dogs Attack Boy In Badangpet
x

Hyderabad: బడంగ్‌పేట్ పరిధిలో బాలుడిపై దాడి చేసిన కుక్కలు

Highlights

Hyderabad: బాలుడికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. తాజాగా బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడా టీచర్స్ కాలనీలో 5 సంవత్సరాల బాలుడుపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి బాలుడు ఆడుకుంటుండగా ఘటన చోటు చేసుకుంది. కుక్కలదాడిలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

కొంతకాలంగా గ్రేటర్ హైదరాబాద్‌లో వీధి కుక్కలు మనుషులు కనిపిస్తే వెంట పడి కరిచేస్తు్న్నాయి. స్కూల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే చిన్నారులు మొదలుకుని మహిళలు, వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు గుంపులుగా వెంటపడి కురుస్తున్నాయి. రోజురోజుకు వీధి కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories