Keesara: పాల వ్యాపారిపై తల్వార్ తో దాడి.. పరిస్థితి విషమం..

Keesara: పాల వ్యాపారిపై తల్వార్ తో దాడి.. పరిస్థితి విషమం..
x

Keesara: పాల వ్యాపారిపై తల్వార్ తో దాడి.. పరిస్థితి విషమం..

Highlights

Keesara: మేడ్చల్ జిల్లా కీసర ప్రధాన కూడలిలో దొడ్ల మిల్క్ మేనేజర్ పై తల్వార్ తో దాడి చేశారు.

Keesara: మేడ్చల్ జిల్లా కీసర ప్రధాన కూడలిలో దొడ్ల మిల్క్ మేనేజర్ పై తల్వార్ తో దాడి చేశారు. ఉదయం కీసరకు కారులో బయల్దేరిన శ్రీనివాస్ ను మార్కెట్ సమీపంలో పాల వ్యాపారి కిరణ్ తల్వార్ తో బలంగా దాడికి పాల్పడ్డారు. శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. పాల వ్యాపారి కిరణ్ దొడ్ల కంపెంనీకి బకాయిలు చెల్లించాల్సి ఉంది.

ఇదే విషయంపై పలుమార్లు బకాయిలు చెల్లించాలంటూ కిరణ్ పై శ్రీనివాస్ వత్తిడి చేశాడు. ఇద్దరు మద్య వాగ్వాదం జరుగుతూ వచ్చింది. బకాయిల విషయంపై మరోసారి శ్రీనివాస్ నిలదీయడంతో కిరణ్ అతికిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను స్థానికులు సమీపంలోని ప్రేవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు కిరణ్ కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories