Jagtial: ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. డెలివరీ కోసం వెళితే కడుపులో క్లాత్‌ వదిలేసిన డాక్టర్లు.. చివరికి ఏం జరిగిందంటే?

Jagtial: జగిత్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది.

Arun Chilukuri
Published on: 18 April 2023 12:15 PM IST
Doctors Leave Cotton in Womans Stomach During Surgery in Jagtial Govt Hospital
X

Jagtial: ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. డెలివరీ కోసం వెళితే కడుపులో క్లాత్‌ వదిలేసిన డాక్టర్లు.. చివరికి ఏం జరిగిందంటే?

Jagtial: జగిత్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఆపరేషన్ చేసి కడుపులో క్లాత్ వదిలేశారు డాక్టర్లు. 16 నెలల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళకు డెలివరీ చేశారు. అయితే ఆపరేషన్ చేసి క్లాత్ మర్చిపోయారు. ఏడాది తర్వాత తీవ్ర కడుపునొప్పితో మహిళ ఆస్పత్రికి వచ్చింది. స్కానింగ్‌లో కడుపులో క్లాత్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి క్లాత్‌ను తొలగించారు.

జగిత్యాల ప్రభుత్వాస్పత్రి నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా స్పందించారు. డెలివరీ పెషేంట్ కడుపులో క్లాత్ మర్చిపోయిన సంఘటన పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. సర్జరీ చేసిన డాక్టర్స్ తో పాటు అసిస్టెంట్ వివరాలు వెంటనే అందించాలని ఆసుపత్రి అధికారికి సూచించారు. పేషెంట్ పరిస్థితి గురించి కూడా వెంటనే తెలుసుకోని రిపోర్ట్ అందించాలంటూ అధికారులకు ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story