మన తెలంగాణ 'పద్మా'లు

మన తెలంగాణ పద్మాలు
x
Highlights

71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో అత్యున్నత పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో చేసిన విశేష...

71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో అత్యున్నత పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలు చేసిన వారికి పద్మపురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాదికి గాను మొత్తం 21 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. పద్మవిభూషన్‌ అవార్డులు ఈసారి ఏడుగురి దక్కాయి.

ఇక ఈ ఏడాది మొత్తం అయిదుగురికి పద్మ అవార్డులు లభించాయి. క్రీడాల విభాగంలో తెలుగు తేజం పీవీ సింధూ, తెలంగాణ నుంచి వ్యవసాయం కేటగిరిలో చింతల వెంకట్ రెడ్డికి.. విద్య, సాహిత్యం కేటగిరిలో విజయసారధి శ్రీభాష్యంకు పద్మశ్రీలు దక్కాయి. ఏపీ నుంచి కళలు కేటగిరిలో యడ్ల గోపాలరావుకి.. దలవాయి చలపతిరావు పద్మశ్రీ లభించాయి.. ఇక వీరికి గాను ఇరువురి రాష్ట్ర ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తెలంగాణా నుంచి పద్మ అవార్డులు అందుకున్న చింతల వెంకట్ రెడ్డి, జయసారధి శ్రీభాష్యం, పీవీ సింధూ ఎవరో తెలుసుకుందాం..

చింతల వెంకట్ రెడ్డి :

చింతల వెంకట్ రెడ్డి డిసెంబరు 22, 1950 న సికింద్రాబాల్‌లో అల్వాల్ ప్రాంతంలో జన్మించారు. గత మూడు దశాబ్దాలుగా సేంద్రీయ పద్ధతిలోనే అయన వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారు. ద్రాక్ష, వరి, గోధుమ, మొక్కజొన్న, చెరుకు, ఆకు కూరలు, కూరగాయలు, గడ్డి పంటలను సాగుచేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాన్ని ప్రయోగశాలగా మార్చి.. అద్భుతమైన ఫలితాలను రాబడుతున్నాడు. మొదటిసారిగా విత్తన రహిత ద్రాక్షను ఇతనే పండించిన వాడిగా గుర్తింపు పొందాడు. సేంద్రీయ వ్యవసాయం కోసం చేసిన సేవలకి గాను రాష్ట్ర, జాతీయ స్థాయిలో అయన అనేక అవార్డులను గెలుచుకున్నాడు.

శ్రీ భాష్యం విజయసారథి :

శ్రీ భాష్యం విజయసారథి 1937 మార్చి 12 న కరీంనగర్ జిల్లాలోని చేగుర్తి గ్రామంలో జన్మించారు. అయన సంస్కృత భాషా పండితుడు. ప్రతిభ, పరిశోధన, విశ్లేషణ, వ్యాఖ్యాన రీతుల్లో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన కవి. ఎన్నో ఉన్నతమైన రచనలు చేశారు. ఆయన చేసిన సాహిత్య సేవకు గుర్తింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వర రావు చేతులమీదుగా 'మహాకవి' బిరుదు అందుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట పురస్కారాన్ని కూడా అందుకున్నారు. దివంగత రచయిత సినారె తర్వాత పద్మ అవార్డు అందుకున్న రెండో సాహితీవేత్త శ్రీభాష్యం విజయసారథి గుర్తింపు పొందారు.

పూసర్ల వెంకట సింధు :

పి.వి. సింధు అసలు పేరు పూసర్ల వెంకట సింధు .. 1995 జూలై 5 న హైదరాబాదులో జన్మించింది. 2016 లో జరిగిన రియో ఒలంపిక్స్ లో రజత పతకం సాధించి ఒలంపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది పి.వి. సింధు .. ఎనిమిదేళ్ళ వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించిన సింధు ఇక అదే తన ప్రోపెషన్ గా మార్చుకుంది. అతిచిన్న వయసులోనే ప్రపంచస్థాయి క్రీడాకారిణులను మట్టికరిపించి ఔరా అనిపించింది. 2013, 2014లో అంతర్జాతీయ క్రీడల్లో రెండు కాంస్యాలు, 2017, 2018లో రెండు రజత పతకాలు సాధించింది సింధు. 2015లో పద్మశ్రీ, 2016లో ఖేల్త్న్ర దక్కించుకున్నది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories