Amit Shah: ఆ పార్టీని ముట్టుకోవద్దు... టార్గెట్ చేస్తే లక్ష్యం నెరవేరదు..

Amit Shah: బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్‌షా తెలంగాణ నాయకత్వానికి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Arun Chilukuri
Updated on: 16 May 2022 5:15 PM IST
Do not Touch That Party Target Will not Achieve the Goal Says Amit Shah
X

Amit Shah: ఆ పార్టీని ముట్టుకోవద్దు... టార్గెట్ చేస్తే లక్ష్యం నెరవేరదు..

Amit Shah: బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్‌షా తెలంగాణ నాయకత్వానికి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలు ఎలా చేయాలో కూడా సవివరంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ముట్టుకోవద్దన్నారు. బీజేపీ టెర్గెట్ టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలేనని కుండబద్ధలు కొట్టారు. కాంగ్రెస్‌ను ముట్టుకోవద్దని ఆ పార్టీ పేరు ఉచ్చరించొద్దని హితవు పలికారు. దేశంలో కాంగ్రెస్ ఎక్కడా లేదని ఆ పార్టీని తెలంగాణలో కూడా టార్గెట్ చేయనక్కర్లేదన్నారు.

కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తే లక్ష్యం నెరవేరదని మూకుమ్మడిగా టీఆర్ఎస్, మజ్లిస్‌పై విమర్శలు చేస్తే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారన్నారు. అధికార పార్టీపై వ్యతిరేకతను బీజేపీకి బదిలీ అయ్యేలా కార్యక్రమాలు చేపడితేనే వచ్చే ఎన్నికల్లో విజయం లభిస్తుందన్నారు. రెండు పార్టీల మధ్యకు కాంగ్రెస్‌ను లాగుతే బీజేపీ లక్ష్యం నెరవేరదన్నారు అమిత్ షా. కాంగ్రెస్ ఊసెత్తకుండానే కతమ్ చేయాలని టీబీజేపీ చీఫ్ కు క్లారిటీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story