సీఎం కేసీఆర్ ని అభినందిస్తూ స్టాలిన్ లేఖ!

సీఎం కేసీఆర్ ని అభినందిస్తూ  స్టాలిన్ లేఖ!
x

MK stalin, KCR 

Highlights

MK Stalin Wrote Letters : ఇటీవల ముగిసిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిన రుణాలు ఎంపికలను అంగీకరించడానికి నిరాకరించిన 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు డీఎంకే అధినేత ఎంకె స్టాలిన్ గురువారం లేఖలు రాశారు .

MK Stalin Wrote Letters : ఇటీవల ముగిసిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో కేంద్రం ప్రతిపాదించిన రుణాలు ఎంపికలను అంగీకరించడానికి నిరాకరించిన 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు డీఎంకే అధినేత ఎంకె స్టాలిన్ గురువారం లేఖలు రాశారు . ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌ఘర్, రాజస్థాన్, ఢిల్లీ,జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు రాశారు. ఈ లేఖలో అయన జీఎస్టీ విషయంలో కేంద్రం, పలు రాష్ట్రాల ప్రయోజనాలను వమ్ము చేస్తోందని, కేంద్రం నిర్ణయాలను అడ్డుకుంటున్నందుకు తమిళ ప్రజలు ఈ రాష్ట్రాలను అభినందిస్తున్నట్టుగా అయన ఆ లేఖలో పేర్కొన్నారు.

అంతేకాకుండా మా స్వంత తమిళనాడు ప్రభుత్వం తన ప్రజలకు ద్రోహం చేస్తూనే ఉన్నప్పటికీ గట్టిగా నిలబడాలని మిమ్మల్ని కోరుతున్నాను అయన ఆ లేఖలో పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలకు కేంద్రం నుంచి రూ. 47,272 కోట్ల జీఎస్టీ పరిహారం రావాల్సి వుందని కాగ్ వెల్లడించిన రిపోర్టును ప్రస్తావించిన ఆయన, ఈ నిధులను వెంటనే చెల్లించేలా కేంద్రంపై ఒత్తిడిని పెంచాలని సలహా ఇచ్చారు.

ఇక ఇది ఇలా ఉంటే కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణానికి ఎంకె స్టాలిన్ గురువారం సంతాపం తెలిపారు. "సామాజిక న్యాయం యొక్క స్తంభం ఈ రోజు పడిపోయింది. పార్లమెంటులో అణగారిన ప్రజల గొంతు మౌనంగా ఉంది" అని ఆయన అన్నారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన కాలంలో తమిళనాడు కోసం వివిధ ప్రాజెక్టులను విలాస్ పాస్వాన్ మంజూరు చేసినట్లు స్టాలిన్ తన సంతాప సందేశంలో తెలియజేశారు.Show Full Article
Print Article
Next Story
More Stories