కాంగ్రెస్‌ నుంచి కీ లీడర్స్‌ వలసలకు డీకే అరుణ మధ్యవర్తిత్వం ఫలిస్తోందా?

కాంగ్రెస్‌ నుంచి కీ లీడర్స్‌ వలసలకు డీకే అరుణ మధ్యవర్తిత్వం ఫలిస్తోందా?
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు కీలక నేతలు బీజేపీలోకి వెళ్లడం ఖాయమా? ఇప్పటికే బీజేపీ కీలక నేతతో వీరు చర్చించారా అతి త్వరలో వీరు కాషాయతీర్థం...

తెలంగాణ కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు కీలక నేతలు బీజేపీలోకి వెళ్లడం ఖాయమా? ఇప్పటికే బీజేపీ కీలక నేతతో వీరు చర్చించారా అతి త్వరలో వీరు కాషాయతీర్థం పుచ్చుకోవడం ఖాయమా ఇవి పక్కనపెడితే కాంగ్రెస్ నుంచి కాషాయంలో వెళుతున్నవారికి, ఒక పవర్‌ఫుల్ వుమన్‌ లీడర్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారా ఆమె ద్వారానే వలసలు జోరందుకుంటున్నాయా? ఇంతకీ కాషాయ కండువా కప్పుకోబోతున్న ఆ ఇద్దరు కీ లీడర్స్ ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఆ మహా నాయకురాలు ఎవరు?

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి వరుసగా వలస వెల్లిన నేతలు, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపిలో వలసలు కడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు నుంచే ఈ ట్రెండ్ ప్రారంభమైయింది. ఎవ్వరూ ఊహించని విధంగా కరడుగట్టిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ కమలం గూటికి చేరారు. అరుణ చేరిన వెంటనే ఆమెతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. కేంద్రంలో బిజేపి మళ్లీ పుల్‌ మెజార్టీతో అధికారంలోకి రావడంతో, ఆమె ద్వారా బిజేపిలో చేరడానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు క్యూకడుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.

రాష్ట్ర్ర బిజేపి నేతలతో సంబంధం లేకుండా బిజేపి ట్రబుల్ షూటర్ రాంమాధవ్ ద్వారా పార్టీలో చేరారు డీకే అరుణ. ఎక్కడున్నా తనదైన ముద్ర వేసే డీకే అరుణ, కాషాయ పార్టీలోనూ చాలా యాక్టివ్‌ అయ్యారు. కాంగ్రెస్ ముఖ్యనేతలంతా జేజమ్మ ద్వారా నేరుగా రాంమాధవ్‌తో చర్చిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం రాంమాధవ్ భేటిలో, మధ్యవర్తిత్వం వహించింది జేజమ్మేనని తెలుస్తోంది. తాజాగా మరో ముగ్గురు కాంగ్రెస్ కీలక నేతలు సైతం డికేతో సంప్రదించి రాంమాధవ్‌తో ప్రత్యేక భేటి నిర్వహించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరగుతోంది.

కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు హైదరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సి‍ం‍హ భార్య పద్మినీరెడ్డిలతో కూడా రాంమాధవ్‌ ప్రత్యేక భేటి జరిగినట్లు బిజేపిలో చర్చించికుంటున్నారు.

ఇక వీరితోపాటు, రంగారెడ్డి జిల్లాకు చెందిన బ్రదర్స్ కూడా బిజేపి వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీళ్లంతా బిజేపిలో జాయిన్ కావడానికి ఆసక్తి చూపుతున్నట్లు పార్టీలో కొందరు మాట్లాడుకుంటున్నారు. వీరంతా డీకే అరుణ మధ్యవర్తిత్వంతో నేరుగా రాంమాధవ్‌‌తో చర్చలు జరిపి, బిజేపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బిజేపిలో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు సమాచారం. గతనెల 29న డీకే అరుణ ఇంట్లో రాంమాధవ్‌ భేటి తరువాత, నేరుగా సదరు కాంగ్రెస్ ముఖ్యనేతలతో చర్చించి ఆ రోజు రాత్రి ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగిన డిన్నర్‌కు హాజరైనట్లు కమలం పార్టీలో చర్చ జరుగుతోంది.

ఇన్ని రోజులు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రెడ్డి సామాజికవర్గం అంతా బిజేపి వైపు తీసుకురావడానికి జేజమ్మ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ను పూర్తిగా రీప్లేస్ చేసి, టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మరి వీరి చేరికలో నిజంగా జేజమ్మ మధ్యవర్తిత్వం వహిస్తున్నారో, లేదంటే కావాలనే కొందరు డీకే అరుణ పేరును తెరపైకి తెస్తున్నారో కానీ, మొత్తానికి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసల్లో మధ్యవర్తి జేజమ్మేననంటూ పొలిటికల్‌ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories