DK Aruna: సీఎం కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదు

DK Aruna: కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఒత్తిడికి గురై విద్యార్థుల ఆత్మహత్యలు

Dhatripriya
Published on: 6 March 2023 5:53 PM IST
DK Aruna Comments On KCR
X

DK Aruna: సీఎం కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదు 

DK Aruna: సీఎం కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదన్నారు జాతీయ బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. తన గొప్ప తనాన్ని చాటుకునేందుకు దిశా కేసులో ఎన్‌కౌంటర్‌ చేయించారని తెలిపారు. మరోసారి అధికారంలోకి రావాలని ఆలోచనే తప్ప.. మహిళలపై జరుగుతున్న దారుణాలపై కేసీఆర్‌కు మరో ధ్యాస లేదన్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఒత్తిడికి గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా.. కాలేజీ యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రీతి హత్య కేసుపై సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నివారించడానికి సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయాలన్నారు డీకే అరుణ.

Dhatripriya

Dhatripriya

Next Story