DK Aruna: BRS సర్కార్‌పై మండిపడ్డ బీజేపీ నాయకురాలు డీకే అరుణ

DK Aruna: బీజేపీ పై కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది

Dhatripriya
Updated on: 6 April 2023 3:05 PM IST
DK Aruna Comments On BRS Party
X

DK Aruna: BRS సర్కార్‌పై మండిపడ్డ బీజేపీ నాయకురాలు డీకే అరుణ

DK Aruna: బీఆర్ఎస్ సర్కార్‌పై బీజేపీ నేత మాజీమంత్రి డీకే అరుణ మండిపడ్డారు. బీజేపీ పై కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చటానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. తనంతట తానుగా ఫోన్లు ఇవ్వలేదని, ఈడీ అడిగితేనే ఎమ్మెల్సీ కవిత సెల్ ఫోన్లు తీసుకెళ్ళారన్నారు. బండి‌ సంజయ్ ఫోన్‌పై పోలీసులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని డీకే అరుణ అన్నారు. ఈడీ విచారణలో ఏం జరిగిందో కవితకు ధైర్యముంటే బయటకు చెప్పాలన్నారు. బండి సంజయ్ అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు డీకే అరుణ.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై ఇప్పటివరకు చర్యలెందుకు తీసుకోలేదని డీకే అరుణ ప్రశ్నించారు. ప్రశ్న పత్రాల లీక్ ఘటనపై మాట్లాడని మంత్రులు.. బండి సంజయ్‌పై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గ్రూప్ వన్ సహా.. ప్రతి ప్రశ్నా పత్రం లీక్ అవుతుందన్నారు. పిచ్చోని చేతిలో రాయి.. కేసీఆర్, కేటీఆర్‌కే వర్తిస్తుందన్నారు. పిచ్చోని చేతిలో రాయిని పెట్టామని ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు. అంతేకాకుండా కేసీఆర్‌ను మించి పోయి కేటీఆర్ ప్రధానిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ తీరును దేశ ప్రజలంతా గమనిస్తున్నారని.. పోలీస్ ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డీకే అరుణ కోరారు.

Dhatripriya

Dhatripriya

Next Story