తగ్గిన కాలుష్యం : గ్రీన్ జోన్ గా రికార్డయిన హైదరాబాద్

తగ్గిన కాలుష్యం : గ్రీన్ జోన్ గా రికార్డయిన హైదరాబాద్
x
Highlights

దీపావళి పండుగ నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అప్రమత్తమయ్యారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు.

దీపావళి టాపాకాయల మోతకు సౌండ్ పొల్యుషన్, ఎయిర్ పొల్యుషన్ విపరీతంగా పెరిగి పోతుంది. కాని ఈ సారి అందుకు భిన్నంగా జరిగింది. ఈ యేడు హైదరాబాద్ లో జరిగిన దీపావళి పండుగ నగరాన్ని గ్రీన్ జోన్ లో ఉంచే విధంగా చేసిన పరిస‌్థితులపై ఓ రిపోర్ట్.

దీపావళి పండుగ నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అప్రమత్తమయ్యారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం పీసీబీ అధికారులు గ్రేటర్‌లో దీపావళి కాలుష్యాన్ని నమోదు చేశారు. పండగ రోజును కలుపుకొని మూడు రోజుల పాటు శబ్దకాలుష్యంతో పాటు, వాయు కాలుష్యాన్ని కూడా లెక్కించారు.

కాంతులు వెదజల్లే పటాకులను మాత్రమే కాల్చాలని కోరుతూ.. ప్రసార, ప్రచార సాధనాల ద్వారా పీసీబీ అదికారులు అవగాహన కల్పించారు. దీంతో దీపావళి సందర్భంగా ఈ ఏడాది హైదరాబాద్ నగరంలో నమోదైన ధ్వని తీవ్రత గత 15 ఏళ్లలో కనిష్ట స్థాయిలో ఉంది అంటున్నారు అదికారులు.

ఉత్తరాది నగరాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కాలుష్య తీవ్రత బాగా తక్కువ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు నగరాలు మధ్యస్థం విభాగంలో, ఒకటి సంతృప్తికర విభాగంలో ఉన్నాయి. హైదరాబాద్ నగరం గ్రీన్ జోన్ లో ఉన్నట్టుగా నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories