కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోకి గోదావరి జలాల తరలింపు ప్రకియ

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోకి గోదావరి జలాల తరలింపు ప్రకియ
x

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోకి గోదావరి జలాల తరలింపు ప్రకియ


Highlights

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోకి గోదావరి జలాల తరలింపు ప్రకియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే దిగువ మానేరుకు గోదావరి జలాలను...

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోకి గోదావరి జలాల తరలింపు ప్రకియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే దిగువ మానేరుకు గోదావరి జలాలను తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్‌లో గత ఆదివారం ఒక్క మోటారుతో నీటిని తరలించగా, తాజాగా పంపు హౌస్‌లోని 4 భారీ మోటర్లతో 12 వేల 600 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు.

నంది రిజర్వాయర్‌కు చేరుకున్న గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏడవ ప్యాకేజీలోని జంట సొరంగ మార్గాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్ హౌస్‌కు చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి మరో నాలుగు బాహుబలి మోటర్ల ద్వారా వరద కాలువలోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి మిడ్ మానేరు డ్యాం ద్వారా దిగువ మానేరు జలాశయానికి గోదావరి జలాలను తరలిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని రామగుండం ఏరియా నీటిపారుదల శాఖ ఈ.ఎన్.సి నల్ల వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆరు,ఏడు,ఎనిమిది ప్యాకేజీల ఈఈ నూనె శ్రీధర్‌లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories