Telangana: తెలంగాణలో ఇవాళ్టి నుంచి కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ

* పెండింగ్‌ దరఖాస్తులను క్లియర్‌ చేసిన తెలంగాణ సర్కార్‌ * కొత్తగా 3,09,083 కార్డుల పంపిణీ *లబ్ది పొందనున్న 8,65,430 మంది

Sandeep Reddy
Published on: 26 July 2021 8:53 AM IST
Distribution of New Ration Cards in Telangana From Today 26 07 2021
X

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ

Telangana: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని లబ్దిదారులకు కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేయనుంది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ క్లియర్‌ చేసిన టీ సర్కార్‌ కొత్తగా 3లక్షల 9వేల 83 కార్డులను ఇవ్వనుంది. దీంతో 8లక్షల 65వేల 430 మంది లబ్ది పొందనుండగా నెలకు అదనంగా 14 కోట్ల విలువైన 5వేల 200ల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేయనుంది ప్రభుత్వం. రేషన్‌ పంపిణీపై ఏడాదికి 2వేల 766 కోట్ల నిధులను వెచ్చించనుంది టీ సర్కార్‌.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story