మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాళ్లు మొక్కిన మహిళ.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని విజ్ఞప్తి

Mayor Gadwal Vijayalakshmi: హైదరాబాద్ కాప్రాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

Shekhar G
Published on: 2 Sept 2023 6:24 PM IST
Distribution Of Double Bedroom Houses In Hyderabad Kapra
X

మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాళ్లు మొక్కిన మహిళ.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని విజ్ఞప్తి

Mayor Gadwal Vijayalakshmi: హైదరాబాద్ కాప్రా శ్రీరాంనగర్‌లో డబుల్‌ బెడ్ రూం ఇళ్లు రాలేదని... మహిళ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ కాళ్లు మొక్కి ప్రాధేయపడ్డారు. 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేశారు. మరి కొంత మంది అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి దశలవారీగా డబుల్ బెడ్ రూంలు కేటాయిస్తామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్, దళితబంధ, బీసీ బంధు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి జనరంజకంగా పాలిస్తున్నారని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు రాని వారు కొందరు.. ధర్నాకు దిగారు. ఇందులో భాగంగా.. ఓ మహిళ మేయర్ కాళ్లు మొక్కి ప్రాధేయపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story