మళ్లీ తెరపైకి దిశ కేసు

*దిశ కమిషన్‌ను ఆశ్రయించిన నిందితుల కుటుంబ సభ్యులు *తమకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు *కేసును వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రలోభ పెడుతున్నారని ఆరోపణ

Arun Chilukuri
Updated on: 10 Feb 2021 4:36 PM IST
disha case
X

మళ్లీ తెరపైకి దిశ కేసు (ఫైల్ ఫోటో )

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నిందితుల కుటుంబ సభ్యులు దిశ కమిషన్‌ను ఆశ్రయించారు. తమకు ప్రాణ హాని ఉందని చెబుతూ సంచలన ఆరోపణలు చేశారు. హైకోర్టులో కేసును వెనక్కి తీసుకోవాల్సిదిగా కొందరు ప్రలోభ పెడుతున్నారని.. అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు కుటుంబ సభ్యులు దిశ కమిషన్‌కు తెలిపారు.

మరోవైపు.. చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య యాక్సిడెంట్ కేసులో అనుమానాలున్నాయని తెలిపారు. కుర్మయ్యను గుర్తు తెలియని వ్యక్తులు యాక్సిడెంట్‌లో హత్య చేశారని ఆరోపించారు. దిశా అత్యాచారం కేసులో కీలక విషయాలు బయటపెడతామని పేర్కొన్నారు. హైకోర్టులో కేసును వెనక్కి తీసుకుంటే 25 లక్షలు ఇస్తామని కొందరు ప్రలోభ పెడుతున్నట్లుగా వివరించారు. తమకు లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డిపై అనుమానం ఉందని.. అతడిని కూడా విచారించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story