హైదరాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం

Disgrace To National Flag In Hyderabad
x

హైదరాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం

Highlights

Hyderabad: హోర్డింగ్‌లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, GHMC మేయర్ ఫోటోలు

Hyderabad: హైదరాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. నగరంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో జాతీయ జెండాను తలకిందులుగా ముద్రించారు. కాషాయం రంగు స్థానంలో ఆకుపచ్చ రంగును ముద్రించారు. అయితే ఆ ప్రింట్‌ను పరిశీలించకుండానే హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. దాంతో నగరంలో హోర్డింగ్ చూసిన వారంతా అధికారుల తీరుపై మండిపడుతున్నారు. జాతీయ జెండా తలకిందులుగా ఉన్నా అలాగే హోర్డింగ్ ఏర్పాటు చేయడం.. హోర్డింగ్‌లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, GHMC మేయర్ ఫోటోలు ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. GHMC అధికారులు వెంటనే ఫ్లెక్సీని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories