Telangana: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం

Telangana: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలపై చర్చ

Rama Rao
Published on: 28 Feb 2022 3:05 PM IST
Discussion on the Dates of Telangana State Budget Meetings | TS News Today
X

 సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం

Telangana: తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభమయ్యింది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీల ఖరారు కోసం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశం ప్రారంభమయ్యింది. ఈ స‌మావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, శాస‌న‌స‌భా వ్యవ‌హారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థికశాఖ కార్యద‌ర్శి, సీఎంవో అధికారులు హాజ‌ర‌య్యారు.

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తేదీల‌తో పాటు మండ‌లి స‌మావేశాల తేదీల‌ను కూడా కేసీఆర్ ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది. మార్చి నెలాఖ‌రు లోగా రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌ను ఆమోదించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో మార్చి రెండో వారంలో బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

Rama Rao

Rama Rao

Next Story