Congress: టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పాదయాత్రపై చర్చ

Congress: కాంగ్రెస్ బలోపేతం కావాలంటే పాదయాత్ర చేయాలని నేతల డిమాండ్

Dhatripriya
Updated on: 21 Jan 2023 3:54 PM IST
Discussion On Padayatra In TPCC Wide Meeting
X

Congress: టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పాదయాత్రపై చర్చ

Congress: టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో జరుగుతున్న సమావేశంలో పాదయాత్రపై చర్చ జరిగింది. కాంగ్రెస్ బలోపేతం కావాలంటే పాదయాత్ర చేయాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పడున్న పరిస్థితుల్లో పాదయాత్ర చేస్తేనే పార్టీ బతుకుతుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ అన్నారు. గతంలో YSR చెవెళ్ల నుంచి పాదయాత్ర చేసి కాంగ్రెస్‌కు అధికారం తెచ్చారని ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ గుర్తుచేశారు.

ప్రస్తుతం బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న కొండా సురే‌ఖ జనంలోకి పాదయాత్ర రూపంలో వెళ్తే కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రేవంత్ కానీ, భట్టి కానీ లేదా ఇద్దరు కలిసైన పాదయాత్ర చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య కోరారు. భద్రాచలం నుంచి పాదయాత్ర మొదలుపెట్టాలని ఎమ్మెల్యే వీరయ్య సూచించారు. ఇక నాలుగైదు నెలలు పాదయాత్ర చేస్తే బాగుంటుందని మల్లు రవి అభిప్రాయపడ్డారు.

Dhatripriya

Dhatripriya

Next Story