TS Assembly Today: దళిత బంధుపై నేడు అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ

*ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే దళితబంధుపై చర్చ *దళితబంధు పథకంపై వివరణ ఇవ్వనున్న సీఎం కేసీఆర్

Shilpa
Published on: 5 Oct 2021 11:10 AM IST
Discussion on Dalita Bandhu in Telangana Assembly Today 05 10 2021
X

దళితబంధుపై నేడు అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ(ఫోటో- ది హన్స్ ఇండియా)

TS Assembly Today: దళితబంధు పై నేడు అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే దళితబంధుపై చర్చ చేపట్టనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన అనంతరం పథకంపై సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వనున్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా తలసరి విద్యుత్ వినియోగం, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, చెక్ డ్యాంల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై చర్చించనున్నారు.

మైనార్టీల సంక్షేమం, పాతబస్తీలో అభివృద్ధిపై మండలిలో స్వల్ప కాలిక చర్చ చేపట్టనున్నారు. జీఎస్టీ చట్టసవరణ బిల్లు, టౌటింగ్ చట్టం బిల్లుపై కూడా మండలిలో చర్చ జరగనుంది.

Shilpa

Shilpa

Next Story