Telangana: వైరస్‌ డబుల్‌ మ్యుటేషన్స్‌ వచ్చాయి- తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

Telangana: వైరస్‌ డబుల్‌ మ్యుటేషన్స్‌ వచ్చాయి- తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు
x

Telangana: వైరస్‌ డబుల్‌ మ్యుటేషన్స్‌ వచ్చాయి- తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

Highlights

Telangana: కరోనా తొలిదశ నుంచి ప్రజలు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు.

Telangana: కరోనా తొలిదశ నుంచి ప్రజలు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు. ప్రజలు అజాగ్రత్తతో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండో వేవ్‌లో మ్యూటేషన్ల కారణంగా తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. మొదటి వేవ్‌ తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందన్నారు. రాబోయే రెండు నెలలు ప్రజలు జాగ్రత్తగా ఉంచాలని సూచించారు. ప్ర‌పంచంలోని అగ్ర రాజ్యాలు కూడా క‌రోనా ముందు మోక‌రిల్లుతున్నాయి. గాలి నుంచి వ్యాపించే ద‌శ‌కు క‌రోనా చేరుకుంద‌ని పేర్కొన్నారు.

కొత్త మ్యుటేష‌న్ల కార‌ణంగా క‌రోనా వేగంగా వ్యాపిస్తోంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ విధిగా మాస్కు ధ‌రించాల‌ని సూచించారు. రాష్ర్టంలో ఎక్క‌డా బెడ్ల కొర‌త లేద‌ని, కేవ‌లం 15-20 కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లోనే ప‌డ‌క‌ల కొర‌త ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. రాబోయే రోజుల్లో కొవిడ్ టెస్టుల సంఖ్య‌ను పెంచుతామ‌ని ప్ర‌క‌టించారు. 80 శాతం మంది క‌రోనా బాధితుల్లో ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవు అని వెల్లడించారు. క‌రోనా పాజిటివ్ రాగానే ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories