మందసాగర్..మాములోడు కాదు

మందసాగర్..మాములోడు కాదు
x
Highlights

మహబూబాబాద్ దీక్షిత్‌ కిడ్నాప్‌, హత్య కేసులోని నిందితుడి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మందసాగర్ బావలిద్దరూ పోలీస్‌ కానిస్టేబుళ్లు కావడంతో...

మహబూబాబాద్ దీక్షిత్‌ కిడ్నాప్‌, హత్య కేసులోని నిందితుడి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మందసాగర్ బావలిద్దరూ పోలీస్‌ కానిస్టేబుళ్లు కావడంతో వారికంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో కిడ్నాప్ పథకం రచించాడు నిందితుడు. గతంలో ఓ స్థానిక పోలీస్‌ వాహనానికి తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేసిన మందసాగర్ దీక్షిత్ తండ్రి రంజిత్ దగ్గర డబ్బులున్నాయని గ్రహించాడు. పక్కా ప్లాన్‌ ప్రకారం ఇంటి దగ్గర రిక్కీ నిర్వహించి ఘాతుకానికి పాల్పడ్డాడు.

దీక్షిత్‌ కిడ్నాప్, హత్య కేసులో విచారణ చేస్తుండగా మందసాగర్ నేర చరిత్ర ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. సాగర్ చదివింది 7వ తరగతి అయినా టెక్నాలజీ విషయంలో మంచి పట్టున్న వ్యక్తి. గతంలో ఇజ్రాయిల్ కంపెనీకి చెందిన ఒక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఆ యాప్ ద్వారా యువతిని వేధించాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు నిందితుడు. ఇప్పటికీ ఆ వేధింపుల కేసు పెండింగ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది.

గత ఆదివారం ఇంటి బయట ఆడుకుంటున్న దీక్షిత్‌ను బైక్‌పై వచ్చి మందసాగర్‌ కిడ్నాప్‌ చేశాడు. మహబూబాబాద్‌కు 5 కిలోమిటర్ల దూరంలోని దానమయ్యగుట్టకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులకు దొరికిపోతాననే భయంతో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. హత్య తర్వాత రెండ్రోజుల పాటు తల్లిదండ్రులకు ఇంటర్నెట్‌ కాల్స్‌ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మందసాగర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories