గాంధీ భవన్‌లో డిజిటల్ మెంబర్‌షిప్ సమీక్ష

Gandhi Bhavan: పార్లమెంట్‌ల వారీగా రేవంత్ సమీక్ష... మెదక్ సమీక్షకు పలువురు నేతలు డుమ్మా.

Sriveni Erugu
Published on: 30 Jan 2022 1:04 PM IST
Digital Membership Review at Gandhi Bhavan
X

గాంధీ భవన్‌లో డిజిటల్ మెంబర్‌షిప్ సమీక్ష 

Gandhi Bhavan: హైదరాబాద్ గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన డిజిటల్ మెంబర్‌షిప్ సమీక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్‌ల వారీగా రేవంత్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో రేవంత్‌తో పాటు ఏఐసీసీ కార్యదర్శి బోజురాజు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, డిజిటల్ మెంబర్‌షిప్ స్టేట్ చీఫ్ కో-ఆర్డినేటర్ హర్కర వేణుగోపాల్ , దీపిక్ జాన్ పాల్గొన్నారు. అయితే డిజిటల్ మెంబర్ షిప్ పార్లమెంట్ నియోకవర్గాల సమీక్షకు పలువురు కీలక నేతలు డుమ్మా కొట్టారు. మెదక్ పార్లమెంట్ సమీక్షకు దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, గీతారెడ్డి, తుంకుంటా నర్సారెడ్డి గైర్హాజరయ్యారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story