DIG Sumathi: ప్రతి ఇంట్లో తల్లిదండ్రుల్లో మార్పు రావాలి

DIG Sumathi: ప్రతి ఇంట్లో తల్లిదండ్రుల్లో మార్పు రావాలి

Rama Rao
Published on: 7 April 2022 1:13 PM IST
DIG Sumathi at the Anniversary Function in Secunderabad
X

DIG Sumathi: ప్రతి ఇంట్లో తల్లిదండ్రుల్లో మార్పు రావాలి

DIG Sumathi: ప్రతి ఇంటినుంచి వచ్చే మార్పుతోనే సమాజంలో విప్లవాత్మక మార్పులకు సంకేతమని ఐపీఎస్ అధికారి, తెలంగాణ మహిళా రక్షణ విభాగ డైరెక్టర్ ఇన్ స్పెక్టర్ జనరల్ సుమతి అభిప్రాయ పడ్డారు. సికింద్రాబాద్ హరిహరకళాభవన్‌లో పద్మారావునగర్ శ్రీసాయి విజ్ఞాన భారతి మహిళా కళాశాల 30వ వార్షికోత్సవంలో ఆమె కీలకోపన్యాసం చేశారు. విద్యార్థినుల ఉత్సహాన్ని ప్రోత్సహించాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు.

తల్లిదండ్రుల్లో వ్యవహారశైలితో వచ్చే మార్పులే పిల్లలపై ప్రభావం చూపుతాయనే అభిప్రాయం వ్యక్తంచేశారు. కళాశాల వార్షికోత్సవంలో గణితశాస్త్ర పోటీపరీక్షల్లో ప్రతిభావంతులకు ఆమె జ్ఞాపికలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, ఛైర్ పర్సన్ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవంలో విద్యార్థినుల ఉత్సాహభరితం నృత్యాలను ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story