Rain Alert: తెలంగాణలో నెలకొన్న భిన్న వాతావరణం..ఓ వైపు వడగాలులు.. మరో వైపు వర్షాలు..

Different Weather Conditions in Telangana
x

Rain Alert: తెలంగాణలో నెలకొన్న భిన్న వాతావరణం..ఓ వైపు వడగాలులు.. మరో వైపు వర్షాలు..

Highlights

Rain Alert: నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

Rain Alert: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు తీవ్రమైన ఎండలు.. మరో వైపు వర్షాలతో జనం ఉక్కిరి బిక్కిరయ్యారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వడగాలులు నమోదయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 45.5 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 45.1, భద్రాద్రి జిల్లా సుజాతనగర్‌లో 44.8, కరకగూడెంలో 44.5, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 44.4, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 44.1, ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 43.5, కన్నాయిగూడెంలో 42.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్దలో అత్యధికంగా 6.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌ జిల్లా తాండూరులో 5.1, నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 5, సంగారెడ్డిలో 4.8, వికారాబాద్‌ జిల్లా ధరూరులో 4.7, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసరలో 3.9, కరీంనగర్‌ జిల్లా పెద్దేములలో 3.6 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ పలుచోట్ల వర్షాలు కురిశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories