TSRTC: తెలంగాణ రాజ్‌భవన్‌ ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా

Dharna of RTC Workers in front of Telangana Raj Bhavan
x

TSRTC: తెలంగాణ రాజ్‌భవన్‌ ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా

Highlights

TSRTC: ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్

TSRTC: తెలంగాణ రాజ్‌భవన్‌ ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడించారు. పీవీ మార్గ్ నుంచి వెయ్యి మంది కార్మికులతో ర్యాలీగా వచ్చిన యూనియన్ నేతలు.. రాజ్ భవన్ ముందు బైఠాయించారు. ఇక రాజ్ భవన్ ముట్టడితో యూనియన్ నేతలను చర్చలకు ఆహ్వానించారు గవర్నర్ తమిళిసై. దీంతో పది మంది యూనియన్ నేతలను రాజ్‌భవన్‌లోకి పంపారు పోలీసులు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూనియన్ నేతలతో గవర్నర్ చర్చిస్తున్నారు.

ఇక ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్ ముట్టడించడంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. రాజ్ భవన్ ముట్టడి తనను బాధించిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాను ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకం కాదన్న గవర్నర్ తమిళిసై.. గతంలోనూ కార్మికులకు అండగా ఉన్నానని గుర్తు చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా తన ప్రయత్నం ఉంటుందని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories