Ramachandra Yadav: అంగన్‌వాడీల డిమాండ్ల మేరకు వేతనాలు పెంచుతాం

Ramachandra Yadav: చిత్తూరు జిల్లా పుంగనూరులో ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలకు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ మద్దతు తెలిపారు.

Shekhar G
Published on: 13 Dec 2023 5:54 PM IST
Dharna Of Anganwadis In Punganur Of Chittoor District
X

Ramachandra Yadav: అంగన్‌వాడీల డిమాండ్ల మేరకు వేతనాలు పెంచుతాం

Ramachandra Yadav: చిత్తూరు జిల్లా పుంగనూరులో ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలకు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ మద్దతు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు నిరవధిక సమ్మె కొనసాగుతోంది. పిల్లలు, తల్లులు, బాలింతలకు అత్యవసర సేవలు అందించే అంగన్‌వాడీలను ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అంగన్‌వాడీల డిమాండ్ల మేరకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. తమ పార్టీ మ్యానిఫెస్టోలో కూడా అంగన్ వాడీల అంశాన్ని చేరుస్తామని రామచంద్ర యాదవ్ హామీ ఇచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story