తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ అర్వింద్

Dharmapuri Arvind: మోడీకి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా

Jyothi
Published on: 25 April 2023 7:01 PM IST
Dharmapuri Arvind Visits Tirumala Temple
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ అర్వింద్

Dharmapuri Arvind: తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతూ...యావత్ భారత్ ను ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోడీకి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్ధించానన్నారు.

Jyothi

Jyothi

Next Story