Dharmapuri Arvind: టికెట్లు అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది

Dharmapuri Arvind: కేసీఆర్, రేవంత్ ఇద్దరూ తోడుదొంగలే

Jyothi
Published on: 24 Nov 2023 8:20 AM IST
Dharmapuri Arvind Comments On Congress
X

Dharmapuri Arvind: టికెట్లు అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది

Dharmapuri Arvind: కామారెడ్డి జిల్లా గాంధారిలో నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రోడ్ షో నిర్వహించారు. ఎల్లారెడ్డి బిజెపి అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కలిసి, సుభాష్ రెడ్డిని మోసం చేశారని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. టికెట్లు అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, కేసీఆర్, రేవంత్ రెడ్డి.. ఇద్దరు తోడు దొంగలేనని ఆరోపించారు. కేసీఆర్ సూచించిన 30 మందికి రేవంత్ టికెట్లు ఇచ్చారని విమర్శలు గుప్పించారు. బీసీ సీఎం కావాలంటే బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు ధర్మపురి అర్వింద్.

Jyothi

Jyothi

Next Story