Dharani Portal in Telangana: ధరణిలో ఎక్కడి సమస్యలు అక్కడే!

Dharani Portal Problems in Telangana
x

 ధరణిలో ఎక్కడి సమస్యలు అక్కడే!

Highlights

Dharani Portal in Telangana: ధరణి వచ్చాకే సమస్యలు పెరిగాయంటున్న రైతులు

Dharani Portal in Telangana: ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చి ఏడాది దాటిన సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రైతులు కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్న పట్టించుకునే నాథుడు కరువయ్యారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలలో ప్రతి సోమవారం ప్రజావాణిలో దాదాపు 90 శాతం మంది రైతులు ధరణి ద్వారా ఏర్పడ్డ సమస్యలు పరిష్కారం చేయాలని కలెక్టర్‌లకు వినతిపత్రాలు ఇస్తున్నారు. అయినా ఏడాది గడుస్తున్న ధరణి సమస్యలు పూర్తి కావడం లేదు.

సమస్యల పరిష్కారం కోసం వరుస సమావేశాలు చేస్తున్నారే తప్ప.. గుర్తించిన సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నారు అధికారులు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో ధరణి హెల్ప్ డెస్కులు పెట్టాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. డెస్కుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి.. దరఖాస్తుల అప్‌లోడ్‌కు అవకాశం ఇస్తున్నట్టు తెలిపింది కమిటీ. ప్రస్తుతమున్న మాడ్యూళ్లపై అవగాహన లేక సమస్యలు పరిష్కారం కావడం లేదని అభిప్రాయపడుతున్నారు.

భూ రికార్డుల నమోదులో పొరపాట్లను సరిచేసేందుకు కావాల్సిన మాడ్యూళ్లను త్వరగా అందుబాటులోకి తేవాలని ఆఫీసర్లను ఆదేశించారు. కానీ అధికారులు మాత్రం కమిటీ గుర్తించిన సమస్యలను పరిష్కారం చేయడం లేదు. మాడ్యూళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించిన ఇప్పటి వరకు మాడ్యూళ్లను మాత్రం అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు.

ధరణి సమస్యలపై సవరణల కోసం తహశీల్దార్ లకు కాకుండా కలెక్టర్ లకు అవకాశం ఇవ్వడంతో గ్రామాల్లోని రైతులు చాలామంది కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ధరణీ పోర్టల్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలు 94 శాతం పరిష్కరించినట్లు ప్రకటించింది. కానీ వాస్తవానికి రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసం వేల మంది రైతులు కోర్టుల చుట్టు, తహసిల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టు ప్రతి రోజు తిరుగుతునే ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి.

జిల్లాకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం, రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ చట్టాలను కాలానుగుణంగా మార్చుకుంటూ వెళ్లడం ఇవన్నీ చేస్తేనే భూ సమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు నిపుణులు. ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేయకుండా ధరణి పోర్టల్‌లో అప్షన్‌లు చేంజ్ చేయడం వల్ల రోజుకో సమస్య పెరుగుతుందే తప్పా సమస్యలు సాల్వ్ కావంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే తహశీల్దార్‌లు, RDO లు చేయాల్సిన పనులను కూడా తమకు అప్పగించడంతో పని ఒత్తిడి భారంతో ఏ సమస్యకు పరిష్కారం చూపలేకపోతున్నారని ఆఫీసుల్లో టాక్ వినిపిస్తోంది. చాలా ఫైల్స్ పెండింగ్‌లో ఉంటున్నాయని కలెక్టర్ కార్యాలయాల్లోని అధికారులు ఆఫ్ ‌ది రికార్డుగా చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories