'ధ‌ర‌ణి' పోర్ట‌ల్ ప్రారంభానికి కొత్త ముహూర్తం ఖరారు

ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభానికి కొత్త ముహూర్తం ఖరారు
x
Highlights

తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ ను ప్రారంభించడానికి శుభ ముహుర్తం ఖ‌రారైంది. ఈ నెల 29వ తేదీన మద్యాహ్నం...

తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ ను ప్రారంభించడానికి శుభ ముహుర్తం ఖ‌రారైంది. ఈ నెల 29వ తేదీన మద్యాహ్నం 12.30 గంటలకు తెలంగాణ సీఎం కేసీర్ ధరణి పోర్టల్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ముందుగా ప్రభుత్వం ద‌స‌రా పండుగ రోజు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్రారంభించాల‌నుకున్న‌ప్ప‌టికీ కొన్ని అనివార్య కారనాలతో ఈ కార్యక్రమం వాయిదా ప‌డింది. మొత్తంగా ఈ నెల 29న ధ‌ర‌ణి పోర్ట‌ల్ అందుబాటులోకి రానుంది.

ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ భూమి రిజిస్ట్రేషన్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 570 మండలాల్లో తాసిల్దార్లు ఒక్కో మండలంలో 10 దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఏదైనా మండలంలో సాంకేతిక సమస్యలు వస్తే వాటిని సరిచేయాలని అధికారులు భావించారు. మండాలాల్లో ఎక్కడా ఇబ్బందు లు తలెత్తలేదని, అన్ని మండలాల్లో ట్రయల్స్‌ విజయవంతంగా అయ్యాయని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. శనివారం నాటి వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎస్‌.. ధరణి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, తాసిల్దార్లు, నయాబ్‌ తాసిల్దార్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

తాసిల్దార్లకు ఎంతవరకు అవగాహన వచ్చిందో తెలుసుకోవడానికి మండలానికి 10 చొప్పున ట్రయల్స్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఇదే ధరణి పోర్టల్‌పై తాసిల్దార్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 'ధరణిలో రిజిస్ట్రేషన్ల విధానం చాలా బాగుందని, సులువుగా క్రయవిక్రయాల నమోదు జరుగుతున్నది' అని పేర్కొన్నారు. ఈ మేరకు తాసిల్దార్లుచేపట్టిన ట్రయల్స్‌ విజయవంతం అయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories