Dharani: ధరణి కమిటీ భేటీ.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌తో సమావేశం
Dharani: టీఎస్ ఐఐసీని సమావేశానికి పిలిచిన కమిటీ
Dharani: ధరణి కమిటీ భేటీ.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌తో సమావేశం
Dharani: తెలంగాణ సచివాలయంలో ధరణి కమిటీ కాసేపట్లో సమావేశం కానుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌తో పాటు టీఎస్ ఐఐసీని సైతం సమావేశానికి కమిటీ పిలిచింది. ధరణి సమస్యలతో పాటు రిజిస్ట్రేషన్‌పై కమిటీ చర్చించనుంది. ధరణి కమిటీ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ మేరకు కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా సమస్యలను పరిష్కరించాలని సూచించింది. ప్రభుత్వ సూచన మేరకు తెలంగాణ సచివాలయంలో ఇవాళ పదిన్నర గంటలకు ధరణి కమిటీ సమావేశం కానుంది.
Next Story




