తప్పించుకు తిరుగుతున్న మావోలను పట్టుకోవడానికి పోలీసుల ఎత్తుగడలెంటి ?

తప్పించుకు తిరుగుతున్న మావోలను పట్టుకోవడానికి పోలీసుల ఎత్తుగడలెంటి ?
x
Highlights

మావోల కోటలో పోలీస్ బాస్ పర్యటన ముగిసింది. మరీ మావోయిస్టుల కట్టడికి డీజీపీ పర్యటన బలం చేకూరుస్తుందా పోలీసులు ఎలాంటి అస్త్రాలను సిద్ధం...

మావోల కోటలో పోలీస్ బాస్ పర్యటన ముగిసింది. మరీ మావోయిస్టుల కట్టడికి డీజీపీ పర్యటన బలం చేకూరుస్తుందా పోలీసులు ఎలాంటి అస్త్రాలను సిద్ధం చేశారు. తప్పించుకు తిరుగుతున్న మావోలను పట్టుకోవడానికి పోలీసుల ఎత్తుగడలెంటి.? రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న డీజీపీ మహేందర్ పర్యటనపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలను కట్టడిచేసేందుకు స్వయంగా డీజీపీ మహేందర్‌రెడ్డి రంగంలోకి దిగారు. డీజీపీ హోదా ఉన్న వ్యక్తి జిల్లాలో 5 రోజులపాటు మకాం వేసి విస్తృత చర్యలు చేపట్టడంతో ఉత్కంఠ రేపుతోంది.

రాత్రి, పగలు అన్న తేడా లేకుండా జిల్లాలో పర్యటించారు డీజీపీ. తిర్యాని పోలీస్ స్టేషన్ ను అర్ధరాత్రి వేళ సందర్శించి అందరికీ షాక్ ఇచ్చారు. సెప్టెంబ‌ర్ 2న ఆసిఫాబాద్ జిల్లా, మ‌హారాష్ర్ట స‌రిహ‌ద్దుల్లో డీజీపీ ఏరియ‌ల్ సర్వే చేశారు. గురు, శుక్ర‌వారాల్లో జిల్లా పోలీసు అధికారుల‌తో స‌మీక్షించారు. మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన పోలీసుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. శ‌నివారం కూడా జిల్లా స్థాయి పోలీసు అధికారుల‌తో మారుమూల అట‌వీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల‌పై చ‌ర్చించారు డీజీపీ. రెండు నెలలుగా జిల్లాలో సంచరిస్తున్న ఐదుగురు సభ్యులతో కూడిన మైలారపు అడెళ్లు అలియాస్‌ భాస్కర్‌ బృందాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

మావోయిస్టులకు సహకరిస్తున్న పలువురి పేర్లను బయటపెట్టి వారికి హెచ్చరికలు సైతం జారీచేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు డీజీపీ జిల్లాలోని ఉన్నతస్థాయి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. మావోలపై అనుసరించే వ్యూహాలపై పోలీసులకు దిశ నిర్ధేశించారు డీజీపీ. తప్పించుకున్న మావోలను పట్టుకోవడానికి నిరంతరం కూంబింగ్ లు నిర్వహించాలన్నారు. ప్రాణహిత సరిహద్దు ప్రాంతం, మహారాష్ట్ర సరిహద్దుల వెంబడి పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీజీపీ పర్యటనతో పోలీసుల్లో జోష్ పెరిగింది. మావోలపై దూకుడుగా వ్యవహరించేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. మరీ డీజీపీ వ్యూహాలతో మావోలపై పోలీసులు ఎలా ఆధిపత్యం చెలాయిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories